వ్య‌క్తిత్వంలో మెగాస్టార్‌ని ఫాలో అవుతున్నా

Sunday, September 9th, 2018, 10:04:31 PM IST


మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా -న‌ర‌సింహారెడ్డి` ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. చారిత్ర‌క నేప‌థ్యంలో ఓ యుద్ధ‌వీరుడి క‌థాంశ‌మిది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఉడుకు నెత్తురు, పోరాటాల చ‌రిత్ర‌పై సినిమా తీస్తున్నారు. ఇలాంటి సినిమాకి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ద‌ర్శ‌కుడినే ఎంచుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అస‌లు సురేంద‌ర్ రెడ్డికి ఆ ఛాన్స్ ఎలా వ‌చ్చింది? అంటే అందుకు సూరి ఓ మీడియా చిట్‌చాట్‌లో ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని చెప్పాడు.

ధృవ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా రిలీజ‌య్యాక‌.. ఏ సినిమా చేయాలి అనుకుంటున్న టైమ్‌లో అప్ప‌టికే సైరా క‌థ రెడీ అవుతోంది. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్‌తో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చింది. అలా ర‌చ‌యిత‌ల‌తో మంత‌నాలు సాగాక‌, రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమా చేయాల‌ని అన్నారు. ఈలోగా ఆలోచించుకుని చెబుతాన‌ని అన్నాను. చారిత్ర‌క సినిమా చేయ‌లేదు క‌దా.. అని ఆలోచించాను. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా నువ్వే చేస్తున్నావ‌ని బాస్ అన‌డంతో ఇక ధైర్యంగా ప్రాజెక్టును టేక‌ప్ చేశాను.. అని సూరి తెలిపారు. మెగాస్టార్‌తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం గురించి మాట్లాడుతూ .. మెగాస్టార్‌ వ్య‌క్తిత్వం ఒక పుస్త‌కంలాంటింద‌ని, ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల ఎంతో జ్ఞానం పెరిగింద‌ని అన్నారు. వ్య‌క్తిత్వంలో ఆయ‌న్ని అనుస‌రిస్తాన‌ని తెలిపారు. ఆయ‌న్ను చూసి నా అల‌వాట్లు, అభిరుచులు కూడా మార్చుకున్నాన‌ని అన్నారు. మెగాస్టార్‌తో ప‌నిచేస్తుంటే స‌మ‌యం తెలియ‌డం లేదు. త‌న‌ ద‌ర్శ‌కుడికి ఎప్పుడూ ఆయ‌న ఉత్సాహం ఇస్తారు. అందుకే త‌న‌తో మ‌రింత ప్ర‌యాణం చేయాల‌నుంది. అస‌లు మెగాస్టార్‌ను నేనే డైరెక్ట్ చేస్తున్నానా? అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంటుంది. అదో గొప్ప అనుభూతి అంటూ సూరి ఎగ్జ‌యిట్ అయ్యాడు.

  •  
  •  
  •  
  •  

Comments