ఎన్టీఆర్ అఫర్ కి నో చెప్పిన దర్శకుడు ?

Wednesday, November 2nd, 2016, 04:37:04 PM IST

ntr-and-surendar-reddy
”జనతా గ్యారేజ్” సినిమాతో మళ్ళీ తన క్రేజ్ ని నిలుపుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా తరువాత అయన ఏ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పూరి జగన్నాధ్ తో గాని, లేదా వినాయక్ తో కానీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరో వైపు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది? ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా చేయడానికి ఓ దర్శకుడికి లేటెస్ట్ గా అఫర్ ఇచ్చాడని, అదికూడా..13 కోట్ల రెమ్యూనరేష ఛాన్స్ ఇచ్చాడని తెలిసింది. ఎన్టీఆర్ తో ఆ దర్శకుడు ఇదివరకే రెండు సినిమాలు తీసాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా విజయం సాదించకున్నా కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా .. ఆయనెవరో కాదు సురేందర్ రెడ్డి ? ప్రస్తుతం రామ్ చరణ్ తో ”ధ్రువ” సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో ”అశోక్”, ”ఊసరవెల్లి” సినిమాలు చేసాడు. అయితే ఈ సారి కూడా తనతో సినిమా చేయమని ఎన్టీఆర్ చెప్పడని, కానీ వేరే కమిట్మెంట్ వల్ల ఆ సినిమా చేయనని చెప్పాడట? స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ తో ఆ నెక్స్ట్ సినిమా చేస్తాడేమో చూడాలి ?