ఒక వీడియోలో 24 పాత్రలు.. సూర్య బిగ్గెస్ట్ ఫ్యాన్!

Saturday, May 5th, 2018, 03:30:25 PM IST

సౌత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోల్లో సూర్య కూడా ఒకరు. కోలీవుడ్ కి చెందిన సూర్య టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల లెవెల్లో స్టార్ డమ్ అందుకున్నాడు. ప్రయోగాత్మకమైన పాత్రలతో తన ప్రతి సినిమాతో అలరించే సూర్యకు అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూర్య అభిమానులు సందడి చాలానే కనిపిస్తుంటుంది. అయితే రీసెంట్ గా ఒక అభిమాని సూర్య కెరీర్ లోని ది బెస్ట్ లుక్స్ ని పెన్సిల్ తో వేసి వీడియో గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 24 సినిమాలకు సంబందించిన క్యారెక్టర్స్ ఆ వీడియో కనిపిస్తున్నాయి. సూర్యపై అతను చూపించిన అభిమానానికి నెటిజన్స్ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.