ఈ కార్‌లో న‌య‌న్‌తో షికారు చెయ్‌! డైరెక్ట‌ర్‌కి ఖ‌రీదైన‌ కార్ కానుకిచ్చిన సూర్య‌

Friday, March 16th, 2018, 11:12:06 AM IST

త‌మిళ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం, న‌య‌న్‌తో ఎఫైర్ గురించి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో న‌య‌న్‌తో విఘ్నేష్ విదేశీ షికార్లు వాడివేడిగా చ‌ర్చ‌కు తెర‌లేపాయి. అమెరికా నుంచి ఈ జంట వేడెక్కించే ఫోటోల్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. అదంతా అటుంచితే.. విఘ్నేష్ స్టార్ హీరో సూర్య నుంచి ఖ‌రీదైన కానుక అందుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ఇటీవ‌లే సూర్య క‌థానాయ‌కుడిగా విఘ్నేష్ తెర‌కెక్కించిన `తానా సేంద్ర కూట్ట‌మ్‌` త‌మిళంలో యావ‌రేజ్‌గా నిలిచింది. తెలుగులో ఇదే చిత్రం గ్యాంగ్ పేరుతో రిలీజైన సంగ‌తి తెలిసిందే. సినిమాలో విష‌యం ఉన్నా లేక‌పోయినా ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి, సేఫ్ అయ్యింద‌న్న స‌మాచారం ఉంది. అదంతా అటుంచితే త‌న ద‌ర్శ‌కుడికి హీరో సూర్య అరుదైన కానుకిచ్చాడు. అది కూడా ఖ‌రీదైన ట‌యోటో కార్‌ని కొనివ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఈ కార్‌లో న‌య‌న్‌తో న‌చ్చిన‌ట్టు షికారు చెయ్‌! అన్న‌ట్టే ఉందీ వ్య‌వ‌హారం!