లేడి దర్శకురాలితో సూర్య సినిమా ?

Friday, January 12th, 2018, 10:06:36 AM IST

లేటెస్ట్ గా గ్యాంగ్ సినిమాతో మన ముందుకు వస్తున్నా హీరో సూర్య ఈ సినిమా పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ రోజు భారీ అంచలనతో విడుదలవుతున్న ఈ సినిమా తరువాత సూర్య ఇప్పటికే సెల్వ రాఘవన్, కె వి ఆనంద్ లతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అయన లేడి దర్శకురాలితో సినిమా చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఇంతకి ఆ దర్శకురాలు ఎవరో తెలుసా .. సుధా కొంగర. వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన సుధా తాజాగా సూర్య తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సూర్య కోసం కథను సిద్ధం చేశారట, ఇప్పటికే సూర్యకు కథ వినిపించిందని, కథ నచ్చడంతో ఆమెకు ఓకే చెప్పాడట. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.