ఎస్ 3 (య‌ముడు-3) కొత్త రిలీజ్ డేట్ -ఫిబ్ర‌వ‌రి 3

Tuesday, January 24th, 2017, 05:41:08 PM IST

s3
జ‌ల్లిక‌ట్టు వివాదం సూర్య – స్టూడియోగ్రీన్ మెడ‌కు చుట్టుకున్న సంగ‌తి తెలిసిందే. సింగం సిరీస్‌లో మోస్ట్ అవైంటింగ్ మూవీగా టాక్ ఉన్న ఎస్‌-3 (నోట్‌: త‌మిళ్‌లో సి-3గా టైటిల్ మార్చారు) రిలీజ్‌కి పెద్ద దెబ్బ వేసింది. ఈ వివాదంలో రిలీజ్ చేస్తే గ‌ల్లంత‌యిపోతామ‌ని భ‌య‌ప‌డిన సూర్య కాస్త వెన‌క్కి త‌గ్గాడు. తెలుగులో భారీ రిలీజ్‌ల‌ను దృష్టిలో పెట్టుకుని గ‌తంలో పోస్ట్ పోన్ చేసుకున్న సూర్య మ‌రోసారి జ‌ల్లిక‌ట్టు పుణ్య‌మా.. అని వాయిదా వేసుకోవాల్సొచ్చింది. జ‌న‌వ‌రి 26నుంచి తేదీ వెన‌క్కి వెళ్లింది.

ఏదైతేనేం .. ఇక లైన్ క్లియ‌ర్‌. కొత్త తేదీని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. పిబ్ర‌వ‌రి 3న సినిమా రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అటు త‌మిళ్‌లో ఎస్‌3, ఇటు తెలుగులో య‌ముడు -3 ఒకేసారి రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు. స్టూడియోగ్రీన్ ప‌తాకంపై ఙ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమాకి హారీష్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందించారు. తెలుగులో సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మ‌ల్కాపురం శివ‌కుమార్ రిలీజ్ చేస్తున్నారు.