ఈ హీరోల వల్ల నిర్మాతలకు 15 లక్షలు సేవ్ అయినట్టే !

Sunday, March 25th, 2018, 11:02:02 PM IST

ఒక సినిమాను తెరకెక్కించాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్టర్ అయినా అతని వెనుక ఉండే సినిమాకు కావాల్సిన వన్ని సమకూర్చేది మాత్రం ప్రొడ్యూసర్. సినిమా ఫెయిల్ అయితే నష్టపోయేది నిర్మాతే అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆలాంటి నిర్మాత నటీనటులకు సంబందించిన కొన్ని విషయాల్లో ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడని ప్రతి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అది నిజమే. సినిమా హీరో హీరోయిన్స్ కి సంబందించిన పర్సనల్ మేకప్ మెన్ కు అలాగే అసిస్టెంట్ లకు జీతాలు ఇవ్వాలి.

నిర్మాతలు చెప్పిన వారిని పెట్టుకోకుండా వారికి ఇష్టమైన వారినే ఎంచుకుంటారు. ఎంత అడిగితే అంత ఇవ్వాలి. ఆ విధంగా 10 నుంచి 15 లక్షల వరకు నిర్మాతలపై భారం పడుతుంది. అయితే కోలీవుడ్ లో ఈ రూల్ ని బ్రేక్ చేయాలనీ విశాల్ శ్రీకారం చుట్టాడు. సూర్యా – కార్తీ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి పర్సనల్ మేకప్‌మెన్‌‌లకు, డిజైనర్లకు నిర్మాతలు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా రెమ్యునరేషన్ నుంచే వారికి సొంతంగా జీతాలు ఇస్తామని సూర్య బ్రదర్స్ అలాగే విశాల్ తెలియజేశారు. మిగతా హీరోలు కూడా ఇదే బాటలో కొనసాగితే బావుంటుందని అక్కడి సిని ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.