చిలసౌ ట్రైలర్ : సుశాంత్ హిట్టు కొడతాడా?

Saturday, July 28th, 2018, 11:09:21 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్టుకోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. కెరీర్ లో ఇంకా గుర్తింపు తెచ్చుకోలేని ఈ హీరో ఇప్పుడు సరికొత్తగా ట్రై చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి ల సౌ’ అనే సినిమా చేశాడు. అందుకు సంబందించిన ట్రైలర్ ను నాగార్జున చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే యూత్ బాగా కనెక్ట్ అయ్యే అంశం ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఇప్పటివరకు సుశాంత్ చేయని సినిమా అని చెప్పవచ్చు. అంతే కాకుండా సుశాంత్ సినిమాలో చాలా న్యాచురల్ గా కనిపించడంతో పాటు సన్నివేశాలు ఆసక్తిని రేపుతున్నాయి. పెళ్లి చేసుకోమంటూ ఓ వైపు తల్లిదండ్రులు స్నేహితులు చెబుతుంటే ఈ క్రమంలో ఒక అమ్మాయిని ఇష్టపడిన యువకుడు ఆ తరువాత ఎదుర్కొన్న అనుభవాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సరదా సన్నివేశాలు ఉండడంతో సినిమా ఓ వర్గం వారిని ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి సుశాంత్ ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments