మాజీ మొగుడి సినిమాకి వచ్చిన భార్య

Tuesday, January 24th, 2017, 02:22:07 PM IST

hrithik-family
బాలీవుడ్ స్టార్ కపుల్ హ్రితిక్ రోషన్ ఆయన భార్య సుసాన్ ఖాన్ రెండేళ్ళ క్రితమే విడిపోయిన సంగతి మనందరికీ తెలుసు. 14 సంవత్సరాలు పెళ్లి చేసుకుని బతికిన తరవాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ముంబై లో హ్రితిక్ కొత్త సినిమా కాబిల్ ప్రీమియర్ సౌ కి ఆమె రావడం అందరికీ షాక్ అనిపించింది. ఏదో వచ్చాను.. వెళ్లాను.. అన్నట్లుగా కాకుండా సెలబ్రిటీలతో కలిసి తెగ ఫోటోలు కూడా దిగేసి హంగామా చేసింది సుసానే. రెండేళ్ల క్రితం విడిపోయినా.. మాజీ భర్త అంటే తన ప్రేమను ప్రదర్శించేందుకు సుసానే ఖాన్ ఏ మాత్రం సంశయాలు వ్యక్తం చేయదు. ఇప్పుడు కాబిల్ ప్రీమియర్ షోకి రావడం కూడా ఇలాంటిదే అని చెప్పాలి. విడాకులు తీసుకున్నా హృతిక్-సుసానేలు ఎప్పుడూ రోడ్డుకెక్కలేదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు.. అవసరం అయిన టైంలో మాజీ మొగుడికి అండగా ఉంటోంది సుసానే.