స్వ‌రాభాస్క‌ర్.. కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ న‌వ్‌

Tuesday, June 5th, 2018, 03:24:11 PM IST

క‌రీనాక‌పూర్‌, సోన‌మ్‌క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్ వంటి హాట్ ముద్దుగుమ్మ‌లు వీరే ది వెడ్డింగ్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర‌వాత స్వేచ్ఛ అనే పాయింట్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు వివాదాలు వెంట వ‌చ్చాయి. ఈ సినిమాలో అడ‌ల్ట్ కంటెంట్ న‌చ్చ‌లేదంటూ పాకిస్తాన్ సీబీఎఫ్‌సీ రిలీజ్‌ని వ్య‌తిరేకించింది. ఇండియాలో ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం బంప‌ర్ హిట్ కొట్టి అద్భుత వ‌సూళ్లు సాధిస్తుంటే .. మ‌రోవైపు ఈ సినిమాలో న్యూడిటీ, డ‌బుల్ మీనింగ్ జోకుల‌పై నెటిజ‌నులు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా స్వ‌రాభాస్క‌ర్‌ని పాకిస్తానీ నెటిజ‌నులు హేట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్వ‌రా భాస్క‌ర్ .. పాకిస్తాన్‌పై ఊహించ‌ని వ్యాఖ్య‌లు చేసింది.

పాకిస్తాన్ ఓ వైఫ‌ల్యం చెందిన దేశం. మ‌త‌మూఢ‌త్వంతో కొట్టుకుపోతున్న దేశం. ఆ దేశాన్ని ప‌ట్టించుకోవాల్సిన ప‌నే లేదు.. అంటూ స్వ‌రా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై పాకిస్తాన్ చెందిన ఓ న‌టి రివ‌ర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక‌పోతే స్వ‌రాభాస్క‌ర్ వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధిస్తూ సోన‌మ్ కపూర్ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments