రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవు.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత అమ్మవారు..!

Monday, July 13th, 2020, 12:28:37 PM IST

తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే బోనాలు ఈ ఏడాది కరోనా కారణంగా సాదాసీదాగా జరుతున్నాయి. అయితే కొద్ది మంది భక్తులతోనే తాజాగా నేడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలలో నేడు ‘రంగం’ ఘట్టం జరిగింది.

అయితే పచ్చికుండపై నిలబడి స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి వినిపించింది. పూజలతో నాకు సంతోషం లేదని ఐదు వారాలు తనకు శాకలు పెట్టాలని గడప గడప నుంచి తనకు నైవేద్యాలు అందాలని అన్నారు. అయితే పాపాలు పెరిగిపోవడంతోనే కరోనా వచ్చిందని భక్తితో తనను కొలిస్తే తన ప్రజలను తప్పకుండా కాపాడుతానని చెబుతూనే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ నేనున్నా అందరిని కాపాడుకుంటానని అమ్మవారు చెప్పుకొచ్చింది.