మహానటి ప్రివ్యూ షో కోసం తీయటి ఆహ్వానం ?

Tuesday, May 8th, 2018, 03:19:28 PM IST

మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమా రేపు గ్రాండ్ గా విడుదల అవుతుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మహానటిగా సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న సావిత్రి అంటే అందరికి ఇష్టమే .. అందుకే ఈ సినిమాను టాలీవుడ్ లోని ప్రముఖులందరికి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా సెలెబ్రేషన్స్ లో అందరు భాగం అవ్వాలని సినీ ప్రముఖులకు ప్రత్యేక షో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులకు స్వీట్ ప్యాకెట్ తో కూడిన ఆహ్వాన పత్రిక ను అందచేసారు.