క‌ర్నాట‌క రాజ‌కీయాల్లోకి స్వీటీ అనుష్క‌

Saturday, May 12th, 2018, 05:36:18 PM IST

స్వీటీ అలియాస్‌ అనుష్క శెట్టి ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? టాలీవుడ్‌ని ద‌శాబ్ధం పాటు ఏలిన ఈ అందాల భామ ఇటీవ‌లి కాలంలో చ‌డీచ‌ప్పుడు లేకుండా ఏమైపోయింది? `భాగ‌మ‌తి` త‌ర‌వాత స్వీటీ వేరొక సినిమాకి సంత‌కం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? `సాహో`లో ప్ర‌భాస్ స‌ర‌సన సంత‌కం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? క‌నీసం జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌తో ప్ర‌భాస్ సినిమాకి అయినా సంత‌కం చేయ‌క‌పోవ‌డంలో మ‌త‌ల‌బు ఏంటి? .. ఇవ‌న్నీ జ‌వాబు లేని శేష ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. అయితే వీట‌న్నిటికీ అనుష్క నుంచి స‌మాధానం తొంద‌ర్లోనే ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. స్వీటీ శెట్టి యాక్టివిటీస్ చూస్తుంటే, ఇక పెళ్లికి రెడీ అయిపోతోంద‌న్న అనుమానాలు క‌ల‌గ‌క మాన‌దు. గ‌త కొంత‌కాలంగా అనుష్క బెంగ‌ళూరు, మంగుళూరు ప‌రిస‌రాల్లోనే ఉంటోంది. త‌న ఫ్యామిలీ వేడుక‌ల్లో సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటోంది. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కు స్వీటీ దూర‌మైంది.

లేటెస్టుగా నేడు క‌ర్నాట‌క ఎన్నిక‌ల సందర్భ ంగా సామాజిక మాధ్య‌మాల్లో ట‌చ్‌లోకొచ్చింది. త‌న ట్విట్ట‌ర్‌లో వేలికి సిరా మార్క్ వేసిన ఓ సింబ‌ల్‌ని పోస్ట్ చేసి క‌న్న‌డ ప్ర‌జ‌ల్ని ఓటేయ‌మ‌ని స్వీటీ కోరింది. “ఓటు ఎంతో విలువైన‌ది. అది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు. ప్ర‌జాస్వామిక విలువ‌ల్ని కాపాడేందుకు తెలివిగా ఆలోచించి మీ ఓటు వేయండి. ఓటు త‌ప్ప‌నిస‌రి“ అని స్వీటీ అలియాస్ అనుష్క కోరింది. 2018 క‌ర్నాట‌క ఎన్నిక‌ల గురించి ఈ స్థాయిలో ప్ర‌చారం చేస్తోంది అంటే ఆ మేర‌కు భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక వేస్తోందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పెళ్లి అంకం పూర్తి చేసుకుని, తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటుందా? అంటే వ‌స్తే మంచిదే. అది నాయిక‌ల విష‌యంలో జ‌రుగుతున‌న‌దేన‌ని విశ్లేషిస్తున్నారు.