స్వీటీ గిఫ్ట్ స‌రే.. శ్ర‌ద్ధా ఏం గిఫ్టిచ్చింది?

Tuesday, October 24th, 2017, 10:31:43 AM IST

ప్ర‌స్తుతం డార్లింగ్ ప్ర‌భాస్ స‌న్నివేశం గురించి ఇంటా బ‌య‌టా ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవైపు స్వీటీ అనుష్క‌తో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌ని, ఈ ఇద్ద‌రికీ పెళ్ల‌యిపోయింద‌ని ఒక‌టే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీట‌న్నిటిపైనా ఆ ఇద్ద‌రూ చాలా సార్లు విరుచుకుప‌డ్డారు. క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఇప్ప‌టికీ అవే వార్త‌లు రిపీట‌వుతూనే ఉన్నాయి.

అయితే నిన్న‌టిరోజున ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ అరుదైన కానుక‌ను స్వీటినుంచి అందుకున్నాడ‌ని చెప్పుకున్నాం. ఓ ఖ‌రీదైన డిజైన‌ర్ వాచ్‌ని స్వీటీ అనుష్క కానుక‌గానిచ్చారు. అయితే ప్ర‌భా గురించి అంతా బాగా తెలిసిన స్వీటీ ఇలాంటి కానుక ప్లాన్ చేస్తే, అస‌లేమీ తెలీని శ్ర‌ద్ధా క‌పూర్‌ ఏం ప్లాన్ చేసింది? సాహో కోస్టార్‌కి శ్ర‌ద్ధా ఎలాంటి అరుదైన ట్రీట్ ఇచ్చింది? అంటూ ఒక‌టే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే ఆన్‌సెట్స్ ఈ ఇద్ద‌రిమ‌ధ్యా వ్య‌వ‌హారంపై గుస‌గుస‌లు రాజుకుంటున్న వేళ శ్ర‌ద్ధా నుంచి డార్లింగ్ ఎలాంటి స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకున్నాడో అంటూ ఎవ‌రికి వారు ఊహించేసుకుంటున్నారు. ఫాంట‌సీ వ‌ద్ద‌మా..! త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ స్వ‌యంగా చెబుతాడేమో జ‌స్ట్ వెయిట్‌!