శ్వేతా బసు…ఎం చేస్తుందో తెలుసా ?

Friday, February 10th, 2017, 02:49:31 PM IST

అప్పట్లో పలు వివాదాలను రేపిన హాట్ శ్వేతా బసు తాజాగా బాలీవుడ్ లోనే గట్టి ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ లో ఎలాగూ అవకాశాలు రావడం లేదు కాబట్టి .. అక్కడే సెటిల్ అయింది. ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడు చేసే పని చూసి అందరు షాక్ అవుతున్నారు .. ? ఇంతకీ ఎం చేసింది అని షాక్ అవ్వకండి .. అసలు విషయం ఏమిటంటే .. హిందీలో ఈ భామ ఓ డాక్యూమెంటరీ ని నాలుగేళ్లు కష్టపడి రూపొందించింది. ఈ ప్రత్యేకమైన డాక్యూమెంటరీ కోసం సంగీత దిగ్గజాలైన ఏ ఆర్ రెహమాన్, గుల్జార్ , పండిత్ శివకుమార్, హరి ప్రసాద్ చౌరాసియా, పండిత్ బీర్జు మహారాజ్ , పండిత్ బస్రాజ్, ఇంతియాజ్ ఆలీ, ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ , సుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఈమె చాలానే కష్టపడ్డట్టుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సౌత్ సినిమాల్లో నటించి డబ్బులు పోగు చేసినట్టు చెప్పింది. 2002లో మాకెడి సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఒక్క హీరోయిన్ గానే కాకుండా సాహిత్యం లో కూడా మంచి అనుభవం ఉంది. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అనుకున్నంత క్రేజ్ దక్కలేదు .. ఆ తరువాత ఆమె వ్యభిచారం కేసులో ఆరోపణులు ఎదుర్కొని పోలీసులకు చిక్కింది. కొన్నాళ్ళు స్టేట్ హోమ్ లో ఉన్న శ్వేతా బసు .. ఆ తరువాత బాలీవుడ్ లోనే ఈ ప్రాజెక్ట్ చేస్తూ అక్కడే ఉంది.