డేంజ‌ర్ బెల్స్‌ : ముసుగేయ‌కుండా బ‌య‌టికెళ్లారో..!?

Saturday, January 28th, 2017, 11:29:58 AM IST

swine-flu
త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ప్ర‌మాదం పొంచి ఉంది. ముసుగేయ‌కుండా .. గాలి పీల్చారో.. మీ గుండెల్లోకి స్వైన్ వైర‌స్ ప్ర‌వేశిస్తుంది. మిమ్మ‌ల్ని క‌ర‌క‌రా న‌మిలేస్తుంది.. అందుకే త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఇక‌నుంచి హైద‌రాబాద్‌లో కానీ, ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ తిరిగినా ముఖానికి ముసుగేసుకునే వెళ్లండి. లేదంటూ స్వైన్‌ఫ్లూ మీపై ఎటాక్ చేయొచ్చు. అటుపై మ‌ర‌ణం సంభ‌వించ‌వ‌చ్చు.

ప‌రిస్థితి తీవ్ర‌త ఈరేంజులోనే ఉంది మ‌రి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ బాధితుల గోడు వింటుంటే, ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి మాట వింటుంటే ఇదే అనిపిస్తోంది. దగ్గు, జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి అంటూ ప్ర‌జ‌లంతా ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. ఓవైపు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, మ‌రోవైపు ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు స్వైన్‌ఫ్లూ రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయ్‌. ఒక్క తెలంగాణ‌లోనే ఇప్ప‌టికి 100 స్వైన్‌ఫ్లూ కేసులు న‌మోద‌య్యాయి. ఇంకా ల్యాబ‌రేట‌రీలో టెస్టుల‌కెళ్లిన‌వి ఎన్నో. అలాగే 6 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మ‌రింత మంది ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే స్వైన్‌ఫ్లూ మ‌హ‌మ్మారీ ఏ రేంజులో విజృంభిస్తుందో అర్థం చేసుకోవాలి. అందుకే బ‌య‌ట తిరిగేప్పుడు విధిగా మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. నాది ఉక్కులాంటి బాడీ అంటే స్వైన్ వైర‌స్ లెక్క చేయ‌దు. తొక్క ఒలిచేస్తుంది. అందుకే త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ప్రివెన్ష‌న్ ఈజ్ బెట‌ర్ దేన్ క్యూర్! అన్నారు డాక్ట‌ర్ పెద్ద‌లు.