సైరా లో మొదటి ఎంట్రీ ఇవ్వనున్న అమితాబ్ !

Monday, January 29th, 2018, 06:29:54 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా సినిమా కోసం ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు అందరూ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ తన హోమ్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి మొదటి సారి హిస్టారికల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్ర యూనిట్ తెరకెక్కించింది. అయితే సినిమాలో అమితాబ్ బచ్చన్ – సుదీప్ వంటీ అగ్ర నటీనటులు కూడా నటించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో వారు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ అందరికంటే ముందుగా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే షెడ్యూల్లో అడుగుపెడతారని ప్రొడక్షన్ టీమ్ తెలియజేసింది. సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించబోతోన్న సంగతి తెలిసిందే.