చంద్రన్నకు సైరా పంచ్.. కోడెల కేసు సిబిఐ కి?

Tuesday, September 10th, 2019, 12:00:08 PM IST

వైసీపీ నేతలలో అతి వేగంగా, విపక్షాలపై విరుచుకుపడే వారిలో ముందుంటారు విజయసాయి రెడ్డి. వైయస్ వివేకానంద కేసులో చంద్రబాబు జగన్ పై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయం లో ఆ హత్య జరగడం వలన, కేసు ని సిబిఐ కి అప్పగించాల్సిందిగా అప్పట్లో జగన్ కోరారు. అయితే ఇపుడు సిబిఐ కి అప్పగించకపోవడం వలన చంద్రబాబు జగన్ పై పలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారం లో విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు పై పంచ్ వేశారు. మీ ప్రభుత్వం హయం లో పోలీసులకి పచ్చ యూనిఫార్మ్ ని తొడిగారు. అందుకె వైయస్ జగన్ గారు సిబిఐ కి అప్పగించాలని అని కోరారు. కానీ ఇపుడు జగన్ హయం లో పోలీసులు స్వేచ్ఛగా వారి పని చేసుకుంటున్నారు. కావాలంటే కోడెల కుటుంబం కేసుని సిబిఐ కి అప్పగించండి అని అడగండి అంటూ ఎద్దేవా చేసారు. వివేకా హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి, జగన్ ని ఒత్తిడి కి గురిచేసేలా చంద్రబాబు నడుచుకుంటున్నారు. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు విజయసాయిరెడ్డి.