అబ్బో .. తాప్సి ఫుల్ జోష్ మీదుందిగా

Sunday, September 18th, 2016, 02:56:45 AM IST

tapsee
గ్లామర్ భామ తాప్సి .. తెలుగులో తనదైన గ్లామర్ తో ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా కెరీర్ పరంగా సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది? అవకాశాలు అయితే బాగానే వచ్చాయి. దాంతో ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వచ్చిన రెండు మూడు సినిమాలతో ఇమేజ్ తెచ్చుకుంది కానీ హిట్ మాత్రం పడలే .. కానీ లెటస్ట్ గా ”పింక్” అనే సినిమా చేసింది. అమితాబ్ తో కలిసి తాప్సి నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ అందుకుంది. ఎమోషనల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాతో తాప్సి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇన్నాళ్లు కలలుగన్న తాప్సి కల ఈ సినిమాతో నెరవేరింది. దీంతో ఈ భామ ఫుల్ జోష్ లో ఉందట !! ఇక బాలీవుడ్ లో దుమ్ము లేపడం ఖాయం అని అంటున్నారు ?