హాకీ ప్లేయ‌ర్ హ‌ర్‌ఫ్రీత్ పాత్ర‌లో తాప్సీ స్ట‌న్నింగ్‌

Tuesday, May 15th, 2018, 02:45:04 PM IST

గంగ‌, ఆనందోబ్ర‌హ్మ చిత్రాలు తెలుగులో బంప‌ర్ హిట్లు అయినా, హిందీ మోజులో ప‌డి ఇక్క‌డ వేరొక సినిమాకి సంత‌కం చేయ‌లేదు తాప్సీ. పింక్‌, నామ్ స‌బానా బాలీవుడ్‌లో ఈ భామ‌కు మంచి క్రేజు తెచ్చాయి. వీటికి తోడు జుడ్వా 2 చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి మ‌రింత కిక్‌ని ఇచ్చింది. ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా నాలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసింది తాప్సీ. త‌డ్కా , సూర్మ , ముల్క్ , మ‌న్మార్జియాన్ .. ఇవ‌న్నీ ఈ భామ కెరీర్‌కు ఎంతో కీల‌క‌మైనవి. ప్ర‌స్తుతం అన్నీ సెట్స్‌పై ఉన్నాయి.

సూర్మ మూవీ హాకీ ప్లేయ‌ర్ సందీప్ సింగ్ జీవిత‌క‌థ స్ఫూర్తితో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో తాప్సీ హ‌ర్‌ప్రీత్ కౌర్ పాత్ర‌లో్న‌ టిస్తోంది. తాజాగా హ‌ర్‌ప్రీత్ మోష‌న్ పోస్ట‌ర్ ని లాంచ్ చేశారు. షాద్అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ భారీ చిత్రం జూలై 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. గాయ‌కుడు కం న‌టుడు దిల్జీత్ దోసాంజి , అంగాన్ భేడీ మూవీలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు.హ‌ర్‌ప్రీత్ పాత్ర‌లో తాప్సీ లుక్నె టిజ‌నుల్ని మెస్మ‌రైజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ లుక్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments