నేను మహేష్ ని అలానే పిలుస్తా: ఎన్టీఆర్

Sunday, April 8th, 2018, 01:14:18 AM IST


భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్ గా జరిగింది. అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి తారక్ మహేష్ లను ఒకే వేదికపై చూసి ఎంతో ఆనందపడిపోయారు. వేడుకలో తారక్ మాట్లాడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ ను తాను ఏమంటానో తెలుసా అని అభిమానులకు చెబుతూ.. మహేష్ అన్న అంటానని సమాధానం ఇచ్చాడు. ముందుగా త ‘నందమూరి తారకరామారావుగారి మనవడిని అయిన నేను, అభిమాన సోదరులందరికీ నమస్కారాలు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ ను స్టార్ట్ చేశాడు.

‘మహేష్ బాబును మమీరందరూ ‘ప్రిన్స్’, ‘సూపర్ స్టార్’ అంటుంటారు. కానీ, నేను మాత్రం ‘మహేష్ అన్న’ అని పిలుస్తాను. ఇక భరత్ అనే నేను వేడుకకు ముఖ్యఅతిథిగా రాలేదు..ఓ కుటుంబసభ్యుడిగా వచ్చాను. నిజంగా చెప్పాలంటే కమర్షియల్ హీరోగా మహేష్ బాబు చేసినటువంటి డిఫరెంట్ సినిమాలు మేమెవరము చేయలేదు. ప్రస్తుతం మేము ఇప్పుడిపుడే ఆయనలా మొదలుపెడుతున్నాం. ఆయనే మాకు ఇన్సిపిరేషన్. ఇక సినిమా అభిమానుల భాషలో చెప్పాలంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని భరత్ అనే నేను మహేష్ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలవాలని తాను కోరుకుంటున్నట్లు తారక్ వివరించాడు. ఇక దర్శకుడి గురించి మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా దర్శకుడు కొరటాల మంచి సందేశాత్మక చిత్రాలను తీస్తారని, అలాగే కమర్షియల్ మసాలాలను కూడా దట్టిస్తారని పొగుడుతూ.. ఈ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments