జగన్ పాటకు డ్యాన్స్ చేసిన ఎమ్మార్వో.. నోటీసులు జారీ..!

Thursday, November 21st, 2019, 12:54:40 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. భారీ మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా జగన్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టారు. అయితే జగన్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టే ఇంత మెజారిటీ సొంతం చేసుకున్నారన్నది వాస్తవం. అయితే ఒక ప్రభుత్వ అధికారి కూడా జగన్ వీరాభిమానో ఏమో తెలీదు కానీ ఆయన చేసిన తప్పు వలన పై అధికారుల కంట పడ్డాడు. అంతేకాదు ఆయనపై నోటీసులు కూడా జారీ చేశారు.

ఇంతకీ ఆయన ఏం తప్పు చేశాడని అనుకుంటున్నారు కదు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో ఎమ్మార్వోగా పనిచేస్తున్న అధికారి తాజాగా వైసీపీకి చెందిన కార్తీక మాస వన భోజనాలకు హాజరయ్యారు. అయితే అక్కడ జగనన్న పాటకు వైసీపీ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పై అధికారులు ఆ ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ఒక పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, జగన్ పాటకు డ్యాన్స్ చేయడంపై ఆ అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.