విపక్షాలపై విరుచుకుపడ్డ తలసాని – కారణం ఏంటి…?

Wednesday, August 14th, 2019, 02:39:04 AM IST

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన డిపిఆర్ ను ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులను కట్టే సామర్థ్యం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీని గద్దెదింపడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుందని, కావున దమ్ముంటే కెసిఆర్ ని ఎదురుగా వచ్చి ఢీకొట్టండని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా మీకు దమ్ముంటే ఎంఐఎం తో బీజేపీ పోరాటం చేసుకోండని, అంతేకాని ప్రతి విషయంలో తెరాస పార్టీ ని అడ్డుపెట్టి మాట్లాడొద్దని తలసాని చెప్పారు.

కొందరు విపక్షాలు కావాలనే కెసిఆర్ కుటుంబం మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోటికి ఎంతొస్తే అంత చెండాలమైన వాఖ్యలు చేస్తున్నారని, ఇప్పటికి కూడా కెసిఆర్ కుటుంబానికి సంబందించిన కుటుంబ సభ్యులెవరైనా కూడా నామినేటెడ్ పదవుల్లో ఉన్నారా అని తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఇకపోతే వెంకటస్వామి ఇతరపార్టీకి సంబందించిన వాడైనప్పటికీ కూడా తనకి మర్యాదిచ్చి, గౌరవంతో ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, కానీ ఆయన తనయుడు వివేక్ బీజేపీలో చేరి ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.