రాచ‌కొండ‌ ఫిలింసిటీ లేద‌ని తేల్చేసిన మంత్రి వ‌ర్యులు!

Saturday, February 11th, 2017, 10:32:33 PM IST


ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక .. మొట్ట‌మొద‌టి ప‌రిణామం తెలంగాణ‌లో ఏ ప‌రిశ్ర‌మ‌ను ఎక్క‌డ పెట్టాలి? అన్న‌ది సీఎం కేసీఆర్ ఎంతో సీరియ‌స్‌గా ఆలోచించారు. అందులో ముఖ్యంగా తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎక్క‌డ ఉండాలి? అన్న‌దానిపైనా చ‌ర్చ సాగింది. ఆ క్ష‌ణం ఎన్నో క‌న్ఫ్యూజ‌న్ ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. హైద‌రాబాద్‌లోనే ప‌రిశ్ర‌మ ఉంటుంది. దాంతో పాటే హైద‌రాబాద్ కి సుదూరంలో ఉన్న‌ రాచ‌కొండ ప‌రిస‌రాల్లోనూ మ‌రో ఫిలింసిటీని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అంతేకాదు అందుకోసం ఏకంగా 4,5 వేల ఎక‌రాల స్థ‌లాల్ని ప్ర‌భుత్వం ప‌రిశీలించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే కాల‌క్ర‌మంలో కేసీఆర్ అడ్మినిస్ట్రేష‌న్‌లో బిజీ అయిపోయి సినీప‌రిశ్ర‌మ ఊసే ఎత్త‌లేదు. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న సీఎం సినీప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టించుకునేంత టైమే లేన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఏదైతేనేం.. అస‌లు రాచ‌కొండ ఫిలింసిటీ ఉందా? లేదా? స‌్థ‌లాల కేటాయింపు జ‌రిగిందా? లేదా? ఇదే ప్ర‌శ్న‌ను సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ముందు ఉంచితే ఓ క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

రాచ‌కొండ లో ఫిలింసిటీ అన్న‌ది గాలి వార్తే. ఫార్మాసిటీ ఏర్పాటు గురించి నాడు సీఎం ఆ చో్టును విజిట్ చేశారు. అలా చ‌ర్చిస్తూ ఇక్క‌డ ఫిలింసిటీ పెడితే ఎలా ఉంటుంది? అని ఓ మాట వేశారు. అంతే త‌ప్ప అక్క‌డ ఫిలింసిటీ ఏర్పాటు అన్న ఆలోచ‌నే లేదు. కానీ మ‌రునాడు మీడియాలో హైలైట్ అయిపోయింది..అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మంత్రి వ‌ర్యులు రాచ‌కొండ ఫిలింసిటీ లేన‌ట్టేన‌ని తేల్చి చెప్పారు.