పాత్రికేయుల‌కు త‌ల‌సాని ఆత్మీయ‌ ఆహ్వానం

Saturday, November 12th, 2016, 08:13:15 AM IST

talasani-srinivas-yadhav
క‌ళ అనే అమృత‌ధార‌తో భువిని పుల‌కింపజేసిన సినీక‌ళామ‌త‌ల్లి ప్ర‌చార‌క‌ర్త‌లు మీరు… తెలుగు సినిమా 85ఏళ్ల చ‌రిత్ర‌లో సినిమా ఈ స్థాయికి ఎద‌గ‌డంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర విస్మ‌రించ‌లేనిది. క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, యావ‌త్ ప‌రిశ్ర‌మ .. ఎంద‌రికో లైఫ్‌నిచ్చే.. మిమ్మ‌ల్ని.. మా రెండో కుమార్తె వివాహం సంద‌ర్భంగా ప్ర‌త్యేక విందున‌కు ఆత్మీయంగా ఆహ్వానించే స‌ద్భాగ్యం నాకు క‌లిగినందుకు సంతోషంగా ఉంది.

మా చిన్న‌మ్మాయి చి.ల‌.సౌ స్వాతికి చి.ర‌వికుమార్ యాద‌వ్‌తో వివాహం సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ‌లోని నా ఆత్మీయులంద‌రితో `మ్యారేజ్ రిసెప్ష‌న్‌` ఏర్పాటు చేశాము. ఈ విందున‌కు పాత్రికేయ మిత్రుల్ని(ఈ-మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా) ఆహ్వానిస్తున్నాం.

వేదిక‌: హెచ్ఐసీసీ- నోవాటెల్‌, హైద‌రాబాద్‌
తేదీ: 13-11-2016 (ఆదివారం)
స‌మ‌యం: సాయంత్రం 7 గంట‌ల నుంచి..

బిజీ షెడ్యూల్‌లోనూ… నా బిడ్డ‌ను ఆశీర్వ‌దించ‌డానికి మీడియా మిత్రులు స‌కుటుంబ స‌మేతంగా విచ్చేస్తార‌ని.. మా కోసం ఈ ఆదివారం సాయంత్రం 7 గంట‌ల‌కు మీ అమూల్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చిస్తార‌ని ఆశిస్తూ ..

మీ ..
త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌