అవంటే లెక్కే లేదంటున్న ..మిల్కి బ్యూటీ !!

Friday, November 18th, 2016, 01:10:04 PM IST

Tamannah1
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న హాట్ భామ తమన్నా .. మంచి జోరుమీదుంది. ఓ వైపు హీరోయిన్ గా క్రేజీ స్టార్స్ తో సినిమాలు చేస్తూనే మరోవైపు .. సెలెక్టీవ్ గా ఐటెం సాంగ్స్ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన ”కత్తి సందై” (తెలుగులో ఒక్కడొచ్చాడు) తెలుగులో బాహుబలి – 2 చిత్రంలో నటిస్తున్న తమన్నా మరో వైపు బాలీవుడ్ లోకూడా ప్రయత్నాలు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ భామకు అవార్డ్స్ అంటే పెద్దగా లెక్కే లేదని చెబుతుంది? ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను అవార్డుల పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితె .. అవార్డులంటే నేను లెక్క చేయను, అవార్డు కోసం సినిమా హిట్ అవ్వాలని అనుకోను, అలాగని ఫ్లాప్ అయిన సినిమాకు అవార్డు వస్తే అందులో ఎలాంటి కిక్ ఉండదని చెబుతుంది. కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేయాలనీ ఉందని అంటుంది !!