స‌మంత పెళ్లి చేసుకొంటే నేనూ చేసుకోవాలా ?

Tuesday, September 27th, 2016, 11:53:18 AM IST

tamanna
సినిమా ఇండ‌స్ట్రీలో ఓ హీరోకి పెళ్లి జ‌రుగుతోందంటే మిగ‌తా బ్యాచిల‌ర్హీ రోల‌కి త‌ల‌పోట్లు మొద‌లైన‌ట్టే. మ‌రి మీ పెళ్లెప్పుడు? అస‌లు ల‌వ్మ్యారేజ్ చేసుకొంటారా? అరేంజ్డ్ మ్యారేజా? అంటూ మీడియా నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి. ఓపిగ్గా స‌మాధానం ఇస్తూ కూర్చోవాలి. హీరోయిన్ల‌కి కూడా సేమ్ ప్రాబ్లెమ్‌. త్వ‌ర‌లో స‌మంత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. అందుకే మీడియా మిగ‌తా సీనియ‌ర్ భామ‌ల వెంట ప‌డుతోంది. స‌మంత పెళ్లి చేసుకొంటోంది, మ‌రి మీ ప‌రిస్థితి ఏంటి? అని అడుగుతోంది. దీంతో వాళ్లు రెండేళ్లు మూడేళ్లు అంటూ స‌మాధాన‌మిస్తున్నారు. ఇటీవ‌ల త‌మ‌న్నాని ఆ ప్ర‌శ్న అడిగితే… “ఏంటండీ నేను న‌టించ‌డం మీకు ఇష్టం లేదా? అయినా స‌మంత పెళ్లి చేసుకొంద‌ని నేనూ చేసుకోవాలా? అస‌లు ఇదెక్క‌డి లాజిక్కూ?“అని గ‌డుసుగా మీడియాకి స‌మాధాన‌మిచ్చింది. దీన్నిబ‌ట్టి త‌మ‌న్నాకి ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశ‌మే లేద‌న్న‌మాట‌. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో అస‌లు ఆట‌ని ప్రారంభించిందామె. అందుకే మ‌రికొన్నాళ్లు అక్క‌డ సినిమాలు చేసి ఆ త‌ర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తుంద‌న్న‌మాట‌.

  •  
  •  
  •  
  •  

Comments