అవంతికకు దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు ?

Thursday, April 12th, 2018, 11:50:43 AM IST

బాహుబలి లో అవంతికగా తనదైన నటనతో ఆకట్టుకున్న మిల్కి భామ తమన్నాకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్ లను ఈ అవార్డు తో సత్కరించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమన్నా పేరుకూడా చేర్చారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో అవార్డులతో పాటు రివార్డులను అందుకుంది. అవంతిక గా తనదైన నటనతో ఆకట్టుకున్న తమన్నాకు ఈ అవార్డు దక్కింది. ఈ నెల 21న అముంబై లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు అందిస్తారట. తనను ఇంత ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం పట్ల తమన్నా గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పింది.