సైరాలో… మిల్కి బ్యూటీ ?

Tuesday, April 10th, 2018, 09:30:39 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151 వ చిత్రం సైరా.. నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కి భామ తమన్నా ? ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమన్నా కనిపిస్తుందని టాక్. నిజానికి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ముందుగా వార్తలు వచ్చాయి .. ఇప్పటికే నయనతారను ఎంపిక చేయగా ఇప్పుడు తమన్నాను తీసుకుంటున్నారు. మరి మరో హీరోయిన్ కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమాలో అవంతిక గా అదరగొట్టిన తమన్నాకు మరో కెరీర్ బెస్ట్ పాత్ర ఇది వార్తలు వస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన నా నువ్వే సినిమాలో నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments