ఆ ఐటెం సాంగ్ లో తమన్నా రెచ్చిపోయిందిగా ?

Thursday, September 22nd, 2016, 03:07:27 PM IST

Tamannah1
ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ తరహా పాటలకు బాలీవుడ్ భామలు ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా వారినే ఫాలో అవుతున్నారు. తాజాగా మిల్కి భామ తమన్నా ”జాగ్వార్” సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది ? అయితే ఈ సాంగ్ లో తమన్నా గ్లామర్ లో ఇరగదీసిందని అంటున్నాయి కన్నడ సినీ వర్గాలు. ఇప్పటివరకు ఎప్పుడు లేనంతగా తమన్నా హాట్ అందాలు ఖచ్చితంగా ప్రేక్షకులకు షాక్ ఇస్తాయట !! నిజానికి తమన్నా తెలుగులో ”అల్లుడు శీను” సినిమాలో ఐటెం సాంగ్ చేయడం మొదలు పెట్టింది, ఆ తరువాత ”స్పీడున్నోడు” చిత్రంలో మరోసారి అదరగొట్టిన ఈ భామ ఈ సాంగ్ లో మాత్రం రెచ్చిపోయిందట. దానికి కారణం కూడా లేకపోలేదు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఏకంగా ఈ సినిమాకు 75 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. ఇప్పటికే అందరి రెమ్యూనరేషన్స్ చుక్కల్లో ఉన్నాయట, ఈ సాంగ్ కోసం తమన్నా కూడా ఏకంగా కోటికి పైగానే తీసుకుందట !! అందుకే ఈ గ్లామర్ డోస్ అని అంటున్నారు. మరి అంతేలే .. ఎంత పిండికి అంత రొట్టె ?