రీమేక్ సినిమాలపై తమన్నా ఆసక్తి ?

Monday, December 4th, 2017, 06:30:30 PM IST

ఈ మధ్య తమన్నాకు కాలం సరిగ్గా కలిసి రావడం లేదు .. బాహుబలి .. అభినేత్రి సినిమాల తరువాత అవకాశాలు కరువైన తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ క్వీన్ సినిమా ఒక్కటే చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత మళ్ళీ ఆమె ఫోకస్ రీమేక్ సినిమాలపైనే పడ్డట్టుంది. అందుకే పలువురు రీమేక్ సినిమాలతో వస్తే .. ఆ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఓ తమిళ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా !! ఆ వివరాల్లోకి వెళితే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచినా జిగర్తాండ సినిమాను హిందీలో ఫర్హాన్ అక్తర్ రీమేక్ చేస్తున్నాడు .. అయన సరసన నటించేందుకు ఓకే చెప్పింది మిల్కి భామ ? సిద్దార్థ్, లక్ష్మి మీనన్ జంటగా నటించిన ఈ సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో లక్ష్మి మీనన్ చేసిన పాత్ర బాగా నచ్చడంతోనే ఈ రీమేక్ కు ఓకే చెప్పినట్టు టాక్. ఇప్పటికే అడపా దడపా హిందీలో కూడా సినిమాలు చేస్తున్న తమన్నాకు మరి ఈ సినిమా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments