సైరాలో ఆసక్తి రేపుతున్న తమన్నా రోల్?

Tuesday, June 5th, 2018, 10:57:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో పలువురు అగ్ర తారలు నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ కాగా , అమితాబ్, సుదీప్, తమన్నా, జగపతి బాబు లాంటి పలువురు నటిస్తున్నారు .. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు తమన్నా పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుంది, ఆమె హీరోయిన్ గా గ్లామర్ పాత్ర అని, కాదు వీరోచిత మహిళగా కనిపిస్తుందంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తమన్నా ఈ సినిమాలో దేవదాసి గా కనిపిస్తుందని టాక్ ? బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవదాసి ఆచారం ఉండేది. అప్పట్లో గుళ్ళలో .. భారత నాట్యం తెలిసిన మహిళా ఆ చుట్టుపక్కల ఊరి వాళ్లకు ఆనందాన్ని పంచేది .. తన నాట్యం ద్వారా ? అలంటి ఆసక్తికర పాత్రలో తమన్నా కనిపిస్తుందని .. ఆమె దేవదాసి తనాన్ని తొలగించి ఆమెకు విముక్తి కలిగిస్తాడట మన సైరా నరసింహ రెడ్డి. ప్రస్తుతం ఈ కథనం మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో నిజమెంత అన్న విషయం పక్కన పెడితే తమన్నా పాత్ర కూడా కథలో కీలకమనే తెలుస్తోంది.