మిల్కి భామకు ఇంత వైరాగ్యం ఏలనో ?

Sunday, March 4th, 2018, 01:11:09 PM IST

జనరల్ గా సినిమా స్టార్స్ జీవితాలు సుఖంగా .. రాయల్ గా సాగుతాయని అనుకుంటారు జనాలు. కానీ ఇక్కడ సుఖం .. సంతోషాలు ఉంటాయన్నది అపోహే అన్న విషయాన్నీ చాలా మంది స్టార్స్ బాహాటంగానే తెలిపారు. ఈ విషయం పై సౌత్ క్రేజీ భామ తమన్నా స్పందించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్పందిస్తూ తమది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప పెద్దగా ఆనందం ఉండదని అంటుంది. హీరోయిన్స్ ఎవరు సంపూర్నంగా సంతోషాన్ని అనుభవించడం లేదని, అన్ని కష్టాలు ఉన్నా కూడా షూటింగ్స్ లో పాల్గొనాలని, మనసులో ఎన్ని బాధలున్నా సరే కెమెరాముంది నవ్వుతు నిలబడాలని చెప్పింది.

సొంత పనులకు .. సొంత మనుషులకు టైం కేటాయించే సమయం ఉండదని, కనీసం నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని చెప్పింది మిల్కి భామ !! సాధారణ అమ్మాయిలలాగా మేము బతకడం లేదని వాపోయింది. ఇండస్ట్రీ లో అవకాశాల కోసం పరితపించాల్సి వస్తుందని ఆమె వేదాంతం వల్లించింది. తమన్నాలో ఇంత వేదాంతం ఎందుకో మరి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వరుస పరాజయాలతో టెన్షన్ మీదుంది కాబట్టి తమన్నా ఇలా వైరాగ్యం లో ఉందేమో అని అంటున్నారు జనాలు.