మరోసారి ప్రత్యేక సాంగ్ లో మెరవనున్న తమన్నా ?

Saturday, April 7th, 2018, 11:02:04 AM IST

ఈ మధ్య ప్రత్యేక పాటల్లో ( ఐటెం సాంగ్స్ ) లో కూడా స్టార్ హీరోయిన్స్ చిందులేస్తూ అంటూ ప్రేక్షకుల్లో క్రేజ్ ని ఇటు డబ్బును బాగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేక హీరోయిన్స్ ఉండేవాళ్ళు .. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఐటెం సాంగ్ అంటే క్రేజీ హీరోయిన్ తో చేయిస్తే ఆ సినిమాకు మరికొంత మైలేజ్ పెంచినట్టు ఉంటుందని భావించి వాళ్లతో ఈ సాంగ్స్ ను చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సాంగ్స్ లో స్టార్ హీరోయిన్స్ మాత్రమే చేస్తారు .. ఇప్పుడు సౌత్ లో కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. తాజాగా రామ్ చరణ్ బోయపాటి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రత్యేక సాంగ్ లో చేయడానికి తమన్నా ఓకే చెప్పినట్టు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో స్వింగ్ జరా .. స్వింగ్ జరా అంటూ ఓ రేంజ్ లో ఊపేసిన తమన్నా మంచి డాన్సర్ అన్న విషయం అందరికి తెలుసు .. తాజాగా ఈ అమ్మడు చరణ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభం రోజున కూడా తమన్నా స్టేజి డాన్స్ చేస్తుందట. ప్రసుతం సినిమాలు తగ్గడంతో ఈ అమ్మడు ఇలా ప్రత్యేక సాంగ్స్ పై ద్రుష్టి పెట్టినట్టు టాక్ !!