కొత్త యాపారం మొదలు పెట్టిన మిల్కి బ్యూటీ ?

Sunday, September 16th, 2018, 09:09:58 PM IST


ఈ మధ్య సినిమా తారలు సినిమాలో చేస్తూనే మరో వైపు ఇతర బిజినెస్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పలు రకాల బిజినెస్ వ్యవహారాల్లో జోరుమీదున్నారు. ఇక బాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ కూడా వ్యాపారరంగంలోకి అడుగులు వేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. తాజాగా సౌత్ క్రేజీ భామ తమన్నా కూడా యాపారం మొదలు పెట్టింది. ఇప్పటికే ఆమె జ్యూయలర్స్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. వైట్ అండ్ గోల్డ్ పేరుతొ ఈ జ్యుయలరీ వ్యాపారం చేస్తుంది. ఇప్పటికే ఇండియాలోని ప్రముఖ పట్టణాల్లో షో రూమ్స్ ఏర్పాటు చేసింది. తాజాగా అమీర్ డిమాండ్ వ్యాపారంలోకి దిగింది. తమన్నా డైమండ్ జ్యువెలరీ పేరుతొ ఈ వజ్రాల వ్యాపారాన్ని మొదలు పెట్టనుంది. ఇప్పటికే దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ బిజినెస్ మొదలు కానుంది. ప్రసుతం తమన్నా తెలుగులో ఎఫ్ 2 సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు హిందీలో ఒక సినిమా తమిళంలో మరో సినిమా చేస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments