సారీ చెప్పు.. అంటూ చెడామ‌డా క‌డిగేసిన మిల్కీ

Wednesday, December 28th, 2016, 01:52:19 PM IST

tamanna
మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా `సారీ` చెప్ప‌మంటూ ద‌ర్శ‌కుడు సూర‌జ్‌ని చెడామ‌డా క‌డిగేసింది. చ‌వ‌క‌బారు కామెంట్లు చేస్తావా? హీరోయిన్లు అంటే మ‌రీ అంత అలుసా? చ‌వ‌క‌బారుగా మాట్లాడుతారా? అంటూ ప్ర‌శ్నించింది. దీంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు దిగొచ్చాడు. త‌మ‌న్నాకి సారీ చెప్పాడు. ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌డం త‌న ఉద్ధేశం కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు.

నిన్న ఓ మూవీ ప్ర‌మోష‌న్‌లో సూర‌జ్ మాట్లాడుతూ -“హీరోయిన్ల‌ను ప్రేక్ష‌కులు గ్లామ‌ర్‌గానే చూడాల‌నుకుంటారు. మోకాళ్ల పైకి పొట్టి దుస్తులు ధ‌రిస్తేనే చూస్తారు. అయినా మిల్కీని శారీలో ఎవ‌రు చూస్తారు. పిక్క‌ల‌పైకి కుర‌చ దుస్తులు ధ‌రిస్తేనే చూస్తారు“ అంటూ కామెంట్ చేశాడు. ఈ వార్త విన్న మిల్కీ అత‌డిపై రుస‌రుస‌లాడింది. అన్న‌ట్టు ఇదే ద‌ర్శ‌కుడు గ‌తంలో న‌య‌న‌తార‌ను కామెంట్ చేసి ఇలానే బుక్క‌య్యాడు. మళ్లీ ఇప్పుడు మిల్కీతో పెట్టుకున్నాడు. మొత్తానికి దర్శ‌కుడిని గింజే అనిపించేసింది త‌మ్మూ.

  •  
  •  
  •  
  •  

Comments