మరోసారి…వీర వనిత పాత్రలో తమన్నా ?

Wednesday, April 25th, 2018, 09:28:49 PM IST


కేవలం గ్లామర్ పాత్రలే కాదు వీర వనితగా తనదైనా సత్తా చాటింది గ్లామర్ భామ తమన్నా. బాహుబలి లో తమన్నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వీర వనితగా నటించేందుకు మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా .. తమన్నా కూడా మరో అవకాశం పట్టేసింది. ఇందులో తమన్నా పాత్ర కథలో కీ రోల్ లో ఉంటుందని టాక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరసింహ రెడ్డి కోసం తమన్నా పాత్ర ప్రాణ త్యాగం చేస్తుందట. ఈ పాత్రకోసం పలువురు హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా తమన్నా ను ఎంపిక చేశారట. మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments