ధటీజ్ .. మహాలక్ష్మి అంటున్న తమన్నా ?

Friday, June 1st, 2018, 10:58:12 AM IST

ధటీజ్.. మహాలక్ష్మి అనే పేరు ఎక్కడో విన్నట్టుంది కదా ? ఆ మధ్య సుకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, తమన్నా నటించిన 100 పర్సెంట్ లవ్ సినిమాలో ఓ సాంగ్ అది. ఇప్పుడు ఆ పాటలోని పల్లవిని తమన్నా నటిస్తున్న చిత్రానికి టైటిల్ గా ఫిక్స్ చేసారు ? ఆ వివరాల్లోకి వెళితే .. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాదిలోని నాలుగు భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

మొదట నీలకంఠ దర్శకత్వంలో తెలుగు సినిమా తమన్నా లీడ్ రోల్ లో మొదలు పెట్టారు .. ఆ తరువాత హీరోయిన్ కు దర్శకుడికి మధ్య విభేదాలు రావడమతొ నీలకంఠ తప్పుకున్నాడు .. తాజాగా అ ! సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు క్వీన్ అనే టైటిల్ పెడతారని అనుకున్నారు .. కానీ ఇప్పుడు టైటిల్ మారింది .. ఈ సినిమాకు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ఖరారు చేసారు. ఇక తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా ఇతర హీరోయిన్స్ తో తెరకెక్కుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments