ఆ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయలేదట ?

Tuesday, September 11th, 2018, 11:15:52 PM IST


మిల్కి భామ తమన్నాకు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలన్నీ ప్లాప్స్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకుని ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ అయినా క్వీన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న దట్ ఇస్ మహాలక్ష్మి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ఈ అమ్మడు అటు స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. తాజగా నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో ఐటెం సాంగ్ చేసిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం పై తమన్నా క్లారిటీ ఇచ్చింది. సవ్యసాచి సినిమాలో తాను ఐటెం సాంగ్ చేయడం లేదని చెప్పింది. నిజానికి ఆ సినిమాకోసం అడిగారని .. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేయలేదట. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని త్వరలోనే మొదలు పెడతారట. అయితే ఈ సాంగ్ బదులు హీరో హీరోయిన్స్ తో రొమాంటిక్ సాంగ్ చేయించాలని దర్శకుడు ప్లాన్ చేసాడట. అది విషయం.

  •  
  •  
  •  
  •  

Comments