సైరాలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ?

Monday, April 16th, 2018, 09:55:23 AM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తమన్నాకు ఈ మధ్య సరైన సక్సెస్ దక్కడం లేదు. బాహుబలి తరువాత చేసిన సినిమాలు పరాజయాలు అందుకోవడంతో పాపం తమన్నాకు కొత్త అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో క్వీన్ సినిమాలో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరా లో ఛాన్స్ దక్కింది. ఇందులో అమితాబ్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తుండగా తాజాగా తమన్నాకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో తమన్నా ది కూడా కీ రోల్ అని తెలిసింది. ఇందులో ఆమె విజయ్ సేతుపతి భార్య పాత్రలో కనిపిస్తుందని టాక్. ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్నా షూటింగ్ లో తమన్నా కూడా పాల్గొంటుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments