కొత్త దర్శకుడితో మళ్ళీ రంగంలోకి దిగిన క్వీన్ ?

Thursday, May 31st, 2018, 10:23:43 AM IST

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను దక్షిణాదిలోని నాలుగు భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నా విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు నీలకంఠం దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల నీలకంఠ తప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు .. కానీ ఈ బాధ్యతలను కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు. అ ! సినిమాతో అందరిని ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ. టాలెంట్ కు నచ్చి ఈ బాధ్యతలు అప్పగించారు. దాంతో షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ ప్రస్తుతం తమన్నాతో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక లోని మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో పదిరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది. ఇక తమిళంలో కాజల్, మలయాళంలో ఓవియా , కన్నడంలో మరో హీరోయిన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలన్నీ ఒక బ్యానర్ లోనే నిర్మితం అవుతున్నాయి.