కబాలి భామను స్టేజ్ పైనే తిట్టేసిన సీనియర్ నటుడు

Friday, September 29th, 2017, 03:52:18 PM IST


తమిళంలో నటుడిగానే కాకుండా నిర్మాతగా మరియు సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాజేందర్. అయన కుమారుడు కూడా తమిళ్ లో హీరోగా ఉన్నారు. అతను ఎవరో కాదు శింబు.అయితే ఇటీవల జరిగిన ఒక వేడుకలో రాజేందర్ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. రాజేందర్ మీడియా ఉండగానే హీరోయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. తమిళ్ లో తెరకెక్కిన ‘విళితిరు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కబాలి ఫెమ్ ధన్షిక కొంచెం సేపు సినిమా గురించి మాట్లాడింది.

అయితే చిత్ర యూనిట్ గురించి అంత సేపు మాట్లాడిన ధన్షిక సినిమాలో పాట పాడిన రాజేందర్ గురించి ఏం మాట్లాడలేదు. దీంతో రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.. మొదట అందరు సరదాకు మాట్లాడుతున్నారులే అనుకున్నారు. కానీ ఆయన మాటలు ఒక్కొక్కటి విన్న తర్వాత అందరు షాక్ అయ్యారు. ధన్షిక అయితే కన్నీళ్లు పెట్టుకుంది. కబాలి సినిమాలో రజినీకాంత్‌తో నటిస్తేనే పెద్ద స్టార్స్ అయిపోరు. సీనియర్స్ కి గౌరవం ఇస్తేనే మంచి లైఫ్ ఉంటుందని చెబుతూ.. అందరిని గౌరవించడం నేర్చుకోవాలని కౌంటర్లు వేశారు. దీంతో తమిళ నాట ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

  •  
  •  
  •  
  •  

Comments