సునీల్ బాటలో ప్రముఖ తమిళ కమెడియన్ ?

Thursday, September 13th, 2018, 11:46:01 PM IST


కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న సునీల్ హీరోగా టర్న్ ఇచ్చి మంచి విజయాలు అందుకున్నాడు .. అయితే హీరో అనిపించుకోవాలంటే బాడీ సైజ్ మార్చాల్సిందే అని పట్టుబట్టి మరి సిక్స్ ప్యాక్ చేసి అదరగొట్టాడు. ఆ మధ్య సునీల్ సిక్స్ ప్యాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయినా విషయం తేలిసిందే. తాజాగా ఇప్పుడు అదే దారిని ఫాలో అవుతున్నాడు ప్రముఖ తమిళ కమెడియన్ సూరి. తమిళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న సూరి తాజాగా శివ కార్తికేయన్, సమంత జంటగా నటించిన సీమ రాజు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మనోడు సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట ? ఇప్పటికే సూరి సిక్స్ ప్యాక్ ఫోటోలు కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. అయితే ఇతగాడు హీరో అవ్వడానికి సిక్స్ ప్యాక్ చేశాడా .. లేక ఈ సినిమా కోసమేనా అన్నది తెలియాల్సి ఉంది. సూరి అటు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య హీరో కార్తీ తో కలిసి నటించిన చినబాబు లో మంచి కమెడియన్ గా అదరగొట్టాడు . మరి సూరి సిక్స్ ప్యాక్ పై ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments