ఈ వీడియో చూసైనా జల్లికట్టు పై బ్యాన్ ఎత్తివేయమంటున్న హీరో..!

Friday, January 20th, 2017, 07:40:34 PM IST

tamil
జల్లికట్టు పై విధించిన నిషేదంఎత్తివేయాలని సెలెబ్రిటీలు ఎవరికీ తోచిన రీతోలో వారు స్పందిస్తున్నారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయమని దాని పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళ హీరో విక్రమ్ ప్రభు ఓ అందమైన వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేసి.. ఈ వీడియో చూసైనా జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. జల్లికట్టు లో ఎద్దులను కర్రలతో కొట్టి వాటిని హింసించేలా సాగుతాయని పెటా లాంటి జంతు హక్కుల సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కానీ తమిళులు జంతువులను హింసించరని, వాటిని ఎంతగా ప్రేమిస్తామో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని అంటున్నాడు.

ఓ బుడ్డోడుకొమ్ములు తిరిగిన ఎద్దుతో ఎలాంటి బెదురూ లేకుండా ఆడుకుంటున్న వీడియోని విక్రమ్ ప్రభు పోస్ట్ చేసాడు. చిన్నపిల్లాడు ఎద్దుకొములను పట్టుకుని అటు ఇటు ఊపినా అది ఏమి అనదు.దాని చెవులు నిమురుతూ సరదాగా ఆదుకుంటాడు. ఎద్దుమాత్రం ఆ పిల్లాడికి ఏమాత్రం ఇబ్బంది కలిగించదు.తమిళనాడులో జంతువుల పెంపకం సంస్కృతి లో భాగమని, అలాగే జల్లికట్టు ని కూడా అలాగే చూడాలని అంటున్నాడు.