వైఎస్ బయోపిక్ లో తమిళ హీరో సూర్య ?

Sunday, March 18th, 2018, 03:46:39 PM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. ఆనందో బ్రహ్మ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈ సినిమాకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వై ఎస్ పాత్రకోసం ఇప్పటికే మమ్ముట్టిని సంప్రదించారు. మరో వైపు వై ఎస్ భార్య విజయమ్మ పాత్రకోసం అటు నయనతారను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతుండగా, తాజాగా ఈ లిస్ట్ లోకి తమిళ స్టార్ హీరో సూర్య లిస్ట్ లోకి వచ్చాడు. ఇందులో జగన్ పాత్రలో సూర్య కనిపిస్తాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సూర్యతో దర్శకుడు చర్చలు జరిపాడని సమాచారం. సూర్య కూడా జగన్ తో మంచి స్నేహం ఉంది. అయన భారతి సిమెంట్ కు సూర్య అంబాసిడర్. కాబట్టి సూర్య తప్పకుండా జగన్ పాత్రలో నచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి సినీ వర్గాలు. మరి ఇందులో నిజానిజాలు ఎంతనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.