అమ్మ బానే ఉంది .. ప్రూఫ్ ఇదే

Tuesday, September 27th, 2016, 05:13:49 PM IST

Jayalalitha1
దాదాపు ఒక వారం రోజుల క్రితం నుంచీ తమిళనాడు మొత్తం అమ్మగా కొలిచే వారి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉండడం తో మీడియా , జనాలు కంగారుగా ఉన్నారు. ఆమె కి తీవ్రమైన జ్వరం తో పాటు డీ హైరేషన్ వలనే చెన్నై అపోలో ఆసుపత్రి లో ఉన్నారు . అర్ధరాత్రి దాటిన తరవాత ఆమెని తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది అంటున్నారు . ప్రస్తుతం ఆసుపత్రి వర్గాలు చెబుతున్నదాని బట్టి చూస్తే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం కాస్త కుదుట పడిందట. ఆమెని సింగపూర్ తీసుకుని వెళుతున్నారు అనే వార్తలతో ఆమె అభిమానులు కంగారుగా ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు అని కూడా అపోలో ఆసుపత్రి వర్గం ఓకే చేసింది. ఆసుపత్రి లో ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అనీ ఆమెకి ఏమీ అవ్వలేదు అనీ ఫాన్స్ కి ధైర్యం చెప్పడానికి అన్నట్టు ఒక పెద్ద ఆధారం లభిస్తోంది ప్రస్తుతం కొన్నాళ్ళ లో జరగబోతున్న స్థానిక ఎన్నికలకి సంబంధించి అభ్యర్ధుల జాబితా ని ఆసుపత్రిలో ఉన్న ఆమోదం తో విడుదల చెయ్యడం జనాలు అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పరిహారాన్ని ఆసుపత్రి నుంచి విడుదల చేయటంతో.. అమ్మ ఆరోగ్యం మీద ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న విషయం తేలిపోయింది.

Comments