ఎన్టీఆర్ అలా మాట్లాడడం భాదగా అనిపించిందన్న డైరెక్టర్ !

Tuesday, September 26th, 2017, 11:41:07 PM IST

సినిమా వివాదాలపై సామజిక అంశాలపై తరచుగా మాట్లాడే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ఎన్టీఆర్ సినీ క్రిటిక్స్ పై చేసిన విమర్శలపై స్పందించారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. సినిమా తీసాక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వారికీ ఉందా లేదా ? అనే చర్చ అనవసరం. అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి. పేషంట్ చచ్చిపోతాడని డాక్టర్ కానటువంటి వాడు అన్నాడని ఎన్టీఆర్ తెలిపాడు. ఎవరో అనగానే పేషేంట్ కి ఏమీ కాదు. పేషంట్ ని బ్రతికించుకునే డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా సినిమాని ప్రేక్షుకులు బ్రతికిస్తారు. ఎవడో గొట్టం గాడు చెప్పిన మాటలని పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మాట్లాడడం టైమ్ వేస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బావుందా బాగాలేదా అనే విషయాన్ని ఎవరైనా చెప్పొచ్చు. అంతేకాని సినిమా పనైపోయింది.. 10 కోట్లు వస్తాయి.. డిపాజిట్లు కూడా రావు అని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అలాంటి వాళ్ళు అసలు విమర్శకులే కాదు. అలాంటి వారి గురించి జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ మాట్లాడడం నిజగా భాదగా అనిపించిందని తమ్మారెడ్డి అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments