ఆ పాపం లో నాకు కూడా భాగస్వామ్యం ఉంది – తమ్మినేని సంచలన వాఖ్యలు

Tuesday, December 10th, 2019, 12:20:37 PM IST

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని ఉద్దేశించి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఆనాడు టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ను గద్దె దింపినటువంటి దారుణమైన పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు వెల్లడించారు. కాగా ఆ సమయంలో సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్‌ గారికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పాపం చేసినందుకే తాను 16 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యానని తమ్మినేని ఆవేదన చెందారు.

కాగా ఒక స్పీకర్ గా సభలో సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని తమ్మినేని వెల్లడించారు. కాగా తనకు ఉన్నటువంటి అధికారంతోనే వల్లభనేని వంశీ కి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే సభలో సభ్యులైన వారందరికీ కూడా సరైన అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత తన మీద ఉన్నదని చెప్పిన స్పీకర్ తమ్మినేని, అదే కారణం వలన రెబల్ అభ్యర్థి వంశీ కి మాట్లాడే అవకాశం ఇచ్చినందువల్లే తనపై టీడీపీ నేతలు విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు.