చంద్రబాబు బెజవాడ రౌడీట!

Wednesday, September 24th, 2014, 04:32:49 PM IST

tammineni-sitaram-and-babu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం హైదరాబాద్ లో విలేకరుల సమవేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో విజయవాడలో ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. అలాగే భూమాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ టిడిపి ప్రజా ప్రతినిధులు, చంద్రబాబు అనుచరులు గబ్బిలాల మాదిరిగా విజయవాడ పరిసర ప్రాంతాలలో కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్, సాండ్, శాండిల్, పొలిటికల్, కార్పోరేట్ మాఫియాలు ఉన్నాయని తమ్మినేని తెలిపారు. కాగా ఈ రోజు గన్నవరం దగ్గర హైవే పై జరిగిన హత్యలు కూడా ఈ నేపధ్యంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు మాఫియా సిటీ తయారు చేయబోతున్నారా అంటూ తమ్మినేని సీతారాం నిలదీశారు.