యమలీల సినిమా తరవాత ఈ సినిమానే

Saturday, November 5th, 2016, 12:50:54 PM IST

narudadonaruda
ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ నటులలో తనికెళ్ళ భరణి గారి స్థానం చాలా ప్రత్యేకం. తన సినిమా నరుడా డోనరుడా కి సంబంధించి బోలెడు విశేషాలు పంచుకుంటున్న తనికెళ్ళ భరణి. ఈ సినిమా కి సంబంధించి హీరో సుమంత్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు. సినిమాకి తానే హీరో అని సుమంత్ చెప్పడం తన మీద అతనికి ఉన్న అభిమానానికి గుర్తు అంటున్నారు తనికెళ్ళ. ‘‘యమలీల సినిమాలో హీరోతో సమానంగా ఉండే క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ‘కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్’ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే చేసాను. మళ్లీ చాలా కాలం తర్వాత ‘నరుడా డోనరుడా’ సినిమాకు సగం బాధ్యత తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత నాకు ఇంకో నాలుగైదు మంచి క్యారెక్టర్లు చేసే అవకాశం వస్తుంది. నా స్ధాయిని మరింత పెంచే సినిమా అవుతుంది. అందుకనే ఈ చిత్రాన్ని నా సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నాను’’ అని భరణి చెప్పారు.